India's GDP: గుడ్‌న్యూస్.. 6.2 శాతం పెరిగిన భారత జీడీపీ..
భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసేనాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది.
భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసేనాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది.
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను చవి చూశాయి. 1414 పాయింట్లు వద్ద సెన్సెక్స్, 420 పాయింట్లు వద్ద నిఫ్టీ కోల్పోయింది. కేవలం ఈ ఒక్క రోజు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, భారతీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ తాజాగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. గోగో బ్రాండ్ కింద విడుదలయ్యాయి. గరిష్ట 12kWh బ్యాటరీ మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 251 కి.మీ మైలేజీ ఇస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కి.మీకు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది.
ఏపీ బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషన్‌కు పెద్ద పీట వేశారు. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు మంత్రివర్గం అమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు.
దేశీ మార్కెట్ భారీ నష్టాల పరంపర కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. సెన్సెక్స్ 900 పడిపోయి మార్కెట్లకు ఫ్రై డేను చూపిస్తోంది.
ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
గోవా టూరిజం పతనం కావడానికి ఇడ్లీ, సాంబార్ కారణమని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. వీటితోపాటు బీచ్‌లో వడా పావ్‌లు విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారికి గోవా వాసులు దుకాణాలు అద్దెకు ఇవొద్దన్నారు.
టెక్ బ్రాండ్ రియల్మీ ఇటీవల Realme P3x 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవాళ ఈ ఫోన్ సేల్ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, రిటైలర్ల స్టోర్లలో సేల్ జరగనుంది. దీనిపై రూ. 1,000 తగ్గింపును పొందొచ్చు.
రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ 'బీప్-బోప్' అన్నట్లుగా మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.