/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bear-jpg.webp)
దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ఈ రోజు ట్రేడింగ్ ను ప్రారంభించాయి. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై మరింత ఒత్తిడి పెంచాయి. దీంతో మార్కెట్లు మొదలవ్వడమే భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు విక్రయాలతో పరిస్థితి మరింత దిగజారిపోయి బ్లడ్ బాత్ను తలపిస్తోంది.
ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోయి..73,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు తగ్గి 22,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 28 నష్టపోయాయి.. రెండు మాత్రమే పెరిగాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 46 నష్టపోగా.. నాలుగు మాత్రమే పెరిగాయి. ఎన్ఎస్ఈలో అన్ని రంగాల సూచీలు ఈరోజు క్షీణతలోనే ఉన్నాయి. ఈరోజు అత్యధికంగా నష్టపోయిన వాటిలో నిఫ్టీ ఐటీ 3.27%, ఆటో 2.65%, మీడియా 2.50%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.05%, మెటల్ 1.82% ఉన్నాయి. వీటితో పాటూ ఫార్మా, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ 1% వరకు క్షీణించాయి.
పెట్టుబడిదారుల సంపద రూ.7.5 లక్షల కోట్లు తగ్గింది.
స్టాక్ మార్కెట్లో షేర్లు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.5 లక్షల కోట్లు తగ్గింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు బిఎస్‌ఇలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.385 లక్షల కోట్లుగా ఉంది. నిన్న ఇది దాదాపు రూ.393 లక్షల కోట్లుగా ఉంది. నిన్న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) రూ.556.56 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. 2025లో, విదేశీ పెట్టుబడిదారులు రూ. లక్ష కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. మార్కెట్లు ఇంతలా పడిపోవడానికి, అమ్మకాలు ఎక్కువగా జరగడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయమే కారణం అని చెబుతున్నారు. మెక్సికో, కెనడా, చైనాలపై టారిఫ్స్ మార్చి 4నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇది మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ కు దారి తీసింది. దీంతో ప్రపంచ మార్కెట్ కూడా 3శాతం పడిపోయింది.
Also Read: TS: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే