/rtv/media/media_files/2025/02/01/DMWCYKcTCeNRRaU46uD8.webp)
stock market
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టాలను చవి చూశాయి. నష్టాలతోనే ట్రేడింగ్ ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కేవలం ఈ ఒక్క రోజు రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. 1414 పాయింట్లు వద్ద సెన్సెక్స్, 420 పాయింట్లు వద్ద నిఫ్టీ కోల్పోయింది. ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, భారతీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 400 పాయింట్ల నష్టంతో నేడు స్టాక్ మార్కెట్లు ప్రారంభయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఏకంగా 1220 పాయింట్లు కోల్పోచింది. నేడు డాలర్‌తో రూపాయి పోల్చుకుంటే రూ.87.50 గా ఉంది.
ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!
Approx 10 lac Cr wealth was wiped out of the equity market; it's hard-earned money from crores of small-time investors.
— Biswajeet (@singh_biswajeet) February 28, 2025
Someone would have invested for kids edu, daughter marriage, or retirement savings. Many suicide cases reported; its an economic emergency #stockmarketcrash
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్..
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రమే సెన్సెక్స్ 30లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై భారీగా పడుతుంది. పన్ను శాతం పెంచడం వల్ల ముదుపర్లలో ఆందోళన పెరుగుతుంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు