/rtv/media/media_files/2025/02/28/tES2qr7gfFPlAeaRuLBO.jpg)
Realme P3x 5G Sale in India at 12 noon via Flipkart
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ తన లైనప్‌లో ఉన్న రియల్‌మీ P3 ప్రో 5G, P3x 5Gను గత వారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవాళ Realme P3x 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో సేల్‌కి రెడీ అయింది. ఇందులో మీడియాటెక్ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 6,000 mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, డస్ట్ -వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ ఉన్నాయి.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
Realme P3x 5G Sale And Offers
రియల్‌మీ P3x 5G ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, రిటైలర్ల స్టోర్లలో సేల్ ప్రారంభం కానుంది. కాగా Realme P3x 5G లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ షేడ్స్ కలర్‌లలో లభిస్తుంది.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
ఇక Realme P3x 5G ధర విషయానికొస్తే.. భారతదేశంలో 6GB/128GB వేరియంట్ రూ.13,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB/128GB వేరియంట్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. Realme అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపును అందిస్తోంది.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
Realme P3x 5G Specifications
Realme P3x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 6400 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 50MP వెనుక కెమెరాతో కూడిన సెకండరీ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా అందించారు. డిస్ప్లే 45Hz నుండి 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్లకు మద్దతు ఇస్తుంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
SuperVOOC టెక్నాలజీ ద్వారా 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీ ఫోన్‌కు శక్తినిస్తుంది. ఫోన్‌లో హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. వాటర్ అండ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.