/rtv/media/media_files/2025/02/28/RCH8M3ZfZwwkJSTntj5J.jpg)
bajaj launched gogo electric autos
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు సైతం తమ వాహనాలను భారతదేశ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా దేశీయ మార్కెట్‌లో మూడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ అయ్యాయి. ప్రముఖ అగ్ర ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ వీటిని తీసుకొచ్చింది. ఈ మూడు ఆటోరిక్షాలు.. గోగో అనే బ్రాండ్ కింద రిలీజ్ అయ్యాయి. కంపెనీ వీటికి వరుసగా P5009, P5012, P7012 పేర్లు పెట్టింది.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
ఈ పేర్లలో మొదటి 'P' అక్షరం ప్యాసింజర్‌ని సూచిస్తుంది.
50, 70 నెంబర్లు ఆటోరిక్షా కొలతలను సూచిస్తున్నాయి.
చివరి అంకెలు 9,12 బ్యాటరీ కెపాసిటీని సూచిస్తాయి. (9 kWh, 12kWh).
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
కి.మీ రూ.1 ఖర్చు
బజాజ్ కంపెనీ ఈ మూడు ఆటోరిక్షాలను చాలా తక్కువ ధరలో తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధర రూ.3.26 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే గరిష్ట ధర రూ.3.83 లక్షల వరకు ఉంది. అయితే ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. దీని గరిష్ట మోడల్ విషయానికొస్తే.. బజాజ్ గోగో P7012 ఆటోరిక్షా 12 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 7.7 bhp పవర్, 36 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఆటోరిక్షా సింగిల్ ఛార్జింగ్‌తో 251 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే అదే సమయంలో దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండనుంది. కిలో మీటర్‌కు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
కాగా ఈ ఆటోరిక్షా గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఇది దూసుకుపోతుందని వెల్లడించింది. అంతేకాకుండా దీని ఫెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. కంపెనీ 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీని సైతం అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇందులోని కొన్ని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో LED లైటింగ్, USB టైప్ A ఛార్జింగ్ పోర్ట్, ఫుల్ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ హజార్డ్ అలర్ట్ వంటి ఫీచర్లు అందించారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!