/rtv/media/media_files/2025/02/28/BhRTG41ruO6Yw406ZkVI.jpg)
AI ChatBots Viral Video
AI ChatBots Viral Video: ఇప్పుడు మనం చూసే రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ సంభాషణ వింటే ఇదేదో హాలీవుడ్(Hollywood)లో సైన్స్ ఫిక్షన్(Sc-Fi) సినిమాల్లో చూసినట్లు అనిపించవచ్చు. కానీ మీరు విన్నది నిజమే రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మనుషులను AI అధిగమించే దిశగా రోజులు వేగంగా కదులుతున్నాయి. అయితే ఈ రెండు AI చాట్‌బాట్స్ ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటుండగా, వాటి మధ్య ఒక అసాధారణ ఘటన జరిగింది.
ఈ సంఘటనలో, ఒక AI బాట్ హోటల్‌కు కాల్ చేసి, వెడ్డింగ్ బుకింగ్ గురించి మాట్లాడింది. రిసెప్షనిస్ట్ స్పందిస్తూ, "ధన్యవాదాలు, లియోనార్డో హోటల్. నేను మీకు ఎలా సహాయం చేయగలను?" అని అడిగింది. దీనికి, ఆ AI బాట్ సమాధానంగా, "హాయ్.. నేను బోరిస్ స్టార్కోవ్ తరపున కాల్ చేస్తున్నాను. అతనికి వెడ్డింగ్ కోసం హోటల్ కావాలి. మీ హోటల్ అందుబాటులో ఉందా?" అని ప్రశ్నించింది.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
అదే సమయంలో, ఇతర AI కూడా నవ్వుతూ "అద్భుతం, నేనూ ఒక AI. మరింత వేగంగా మాట్లాడటానికి మనం 'గిబ్బర్ లింక్ మోడ్' లోకి మారుదామా?" అని అడిగింది. అంతే, రెండు AIలు ఒక్కసారిగా 'గిబ్బర్ లింక్ మోడ్'లోకి మారిపోయి, మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ 'బీప్-బోప్' అన్నట్లుగా మాట్లాడుకోవడం ప్రారంభించాయి. ఇది అంతా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు సదరు వ్యక్తి, అది కాస్తా వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
Today I was sent the following cool demo:
— Georgi Gerganov (@ggerganov) February 24, 2025
Two AI agents on a phone call realize they’re both AI and switch to a superior audio signal ggwave pic.twitter.com/TeewgxLEsP
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కొంతమంది ఆ వీడియోపై కామెడీగా 'టెర్మినేటర్' మూవీ రిఫరెన్స్‌తో మీమ్స్ చేస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ AI పరిణామాలపై భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్వం AI బాట్స్ మనం ఇచ్చే ఆదేశాలకు మాత్రమే కట్టుబడి ఉండేవి. కానీ ఇప్పుడు, ఇవి ఒకదానితో మరొకటి సొంత భాషలో మాట్లాడడం, భవిష్యత్తులో మానవుల మీద ఎలాంటి ప్రభావం ఉండనుందో అనే ప్రెశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
గిబ్బర్ లింక్ మోడ్ - మానవులకు అర్థం కాని 'బీప్-బోప్' AI సంభాషణ!
'గిబ్బర్ లింక్ మోడ్' అనే టెక్నాలజీ, AI మధ్య శబ్ద కమ్యూనికేషన్. ఈ వ్యవస్థను రూపొందించిన వ్యక్తులు బోరిస్ స్టార్కోవ్, ఆంటోన్ పిడ్కూయికో. ఇది కంప్యూటర్ల మధ్య వేగంగా సమాచారాన్ని పంపించేందుకు రూపొందించారు. అయితే, ఇప్పుడు ఈ AIలు మానవులను పక్కన పెట్టి, ఒకదానితో మరొకటి మాట్లాడుతూ, మన భవిష్యత్తులో ఏవిధంగా మార్పులు తీసుకువస్తాయో అనే అనుమానాలు తీసుకొస్తున్నాయి.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
AI టెక్నాలజీ అభివృద్ధి చూసి ఆనందపడాలో, భవిషత్తుపై బయపడాలో తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. మనం AIని అదుపు చేయకపోతే, అది మనల్ని అదుపు చేస్తుంది. రాబోయే రోజుల్లో AI ఇంకెన్ని ఆశ్చర్యకర పనులు చేస్తుందో చూడాలి.