/rtv/media/media_files/2025/02/28/81Tx1T1jkvz334iOLAVH.jpg)
AP budget
AP Budget: ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
శాఖలవారిగా వివరాలు..
ఈ మేరకు బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించారు. వైద్యరోగ్య శాఖకు 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు, జలవనరుల శాఖకు 1820 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. పురపాలక శాఖకు 13862 కోట్లు, ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖకు 11636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
పవన్ శాఖలకు భారీ నిధులు..
2025 26 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీ రాజ్ 18,848 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 796 కోట్లు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీశాఖకు భారీగా నిధులు కేటాయించారు.
Also Read: Ravi Praksh: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు,రహదారుల నిర్మాణానికి 4220 కోట్లు, మచిలీపట్నం భావనపాడు కృష్ణపట్నం రామయ్యపట్నం, అలాగే భోగాపురం పోర్టులకు విజయవాడ విమానాశ్రయాలకు 605 కోట్లు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు 10కోట్లు కేటాయించారు.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం 101 కోట్లు, ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు, ఆదరణ పథకం కోసం 1000 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం 3,486 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం 9407 కోట్లు, దీపం 2.0 కోసం 2,601 కోట్లు, బాల సంజీవని బాల సంజీవిని ప్లస్ కోసం 1163 కోట్లు, మత్స్యకార భరోసా కోసం 450 కోట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్కాలర్షిప్లు కోసం 337 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కోసం 820 కోట్లు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ 400 కోట్లు కేటాయించారు.