BIG BREAKING : అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం!
లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్ గోల్డ్‌ను కావాలనే పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవడం, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గడువు రేపటితో ముగియనుంది. కానీ, మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.
జనగణనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభాను లెక్కించనున్నారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోరెండు విడతల్లో జనగణన నిర్వహిస్తామని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి ,తెలంగాణలో మే 11 నుంచి ఇళ్ల సర్వే నిర్వహిస్తారు.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో ఏపీ మావోయిస్టుల కథ ముగిసిపోయింది.
విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాడు.
విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.
చిత్తూరు జిల్లా చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.