/rtv/media/media_files/2026/03/30/india-census-2026-2026-03-30-15-09-05.jpg)
India Census 2026
India Census 2026 : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభాను లెక్కించనున్నారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోరెండు విడతల్లో జనగణన నిర్వహిస్తామని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1 నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే నిర్వహిస్తారని వెల్లడించారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు.ఇక, తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల సర్వే నిర్వహించనునున్నామని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇస్తామని తెలిపారు. అలాగే సేకరించిన జనాభా లెక్కల వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు (సోమవారం) సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియాతో మాట్లాడారు.. ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ప్రజలు సొంతంగా జనాభా లెక్కల వెబ్‌సైట్‌లో ఇళ్ల సర్వే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఇస్తున్నామని వెల్లడించింది. ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటి పరిస్థితి, ఇంటిలో ఉన్న వసతులు, వస్తువులు, ఇల్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినదా? ఇలా మొత్తం 34 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తొలివిడతలో ఇండ్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతీ ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలన్నీ సేకరిస్తాం. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 30 రోజులపాటు హౌస్ లిస్టింగ్ జరుగుతుందన్నారు. హౌస్ లిస్టింగ్‌కు నెలరోజుల ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు 15 రోజులపాటు అవకాశం ఇస్తామని మృత్యజయ తెలిపారు’..
‘ కాగా ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల వివరాలను సేకరిస్తారు. దీంతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన వివరాల సమాచారాన్ని సేకరిస్తామని మృత్యుంజయ తెలిపారు. ఆ తర్వాత నిర్వహించే రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తాం.https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రూ. 11,718 కోట్లతో జనాభా లెక్కల సేకరణ జరుగుతోందన్నారు. మొబైల్ యాప్ ద్వారానే జనాభా లెక్కల సేకరణ ఉంటుందని,16 భాషల్లో వివరాలు సేకరించి పొందుపరుస్తామన్నారు. ఎన్యుమరేటర్స్ సొంత మొబైల్స్ ద్వారానే జనాభా లెక్కలను సేకరించడం జరగుతుంది తెలిపారు.
Follow Us