AP Crime: విశాఖలో దారుణం.. లవర్ ను చంపి ఫ్రిజ్ లో సగం శవాన్ని దాచి..

విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాడు.

New Update
Crime

Crime

విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవీంద్ర అనే వ్యక్తి ఇండియన్ నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం అయినప్పటికీ తన ప్రియురాలు మౌనిక (28)తో సంబంధం కొనసాగించాడు. 

Also Read: షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

Man Kills His Girlfriend

రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన టైమ్‌లో మౌనికను అతడు ఇంటికి పిలిపించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో వీళ్లిద్దరి మధ్య ఆర్థిక పరమైన అంశాలపై వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రవీంద్ర.. మౌనికను హతమార్చాడు. హత్య తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. సగభాగాన్ని ఫ్రిజ్‌లో పెట్టాడు. మరో భాగాన్ని మూటగట్టి ఇంట్లో ఓ మూలన పెట్టాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. 

Also Read: DMK మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.2 వేలు, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్..

నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేశారు. మౌనిక తనను డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తోందని.. ఇది తట్టుకోలేకే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.  కేసు నమోదు చేసిన పోలీసలు దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో జరిగిందా లేదా ప్లాన్‌తోనే ఈ హత్య జరిగిందా అనే దానిపై విచారణ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు