Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ అమరావతికి బదులుగా మావిగన్‌ పేరుతో మరోరాజధానిని సూచించారు.

New Update
Jagan

Jagan

Amaravati : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు(బుధవారం)  లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అమరావతి బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్‌ కొత్త సూచన చేశారు. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ఆయన ప్రతిపాదించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధానికి ప్లాన్‌ బీ పేరిట జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని సూచించారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కి.మీ. విజయవాడ నుంచి గుంటూరుకు 40కి.మీ. ఈ ప్రాంతంలో మొత్తం 110 కి.మీ హైవే ఉంది. మావిగన్‌ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. అని ఆయన కోరారు. అయితే తను అమరావతికి వ్యతిరేకం కాదు అన్న జగన్‌ అది సాధ్యమవుతుందా లేదా అనేది ఆలోచించాలన్నారు.

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్‌ ఇంజిన్‌ ఉండాలని జగన్‌ అన్నారు. అందుకే ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం పడకుండా ఉండాలనే ఆలోచన చేశామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్‌ కారిడార్‌ కింద డిక్లేర్‌ చేస్తే గ్రోత్‌ ఇంజిన్‌ తయారవుతుందని చెప్పాం కానీ దాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని జగన్‌ ఆరోపించారు. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్‌ కారిడర్‌ ఏర్పడుతుందని ఆయన సూచించారు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉందన్న జగన్‌ అదొక మహానగరంగా, గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదుగుతుందని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదన్నారు. తన స్కామ్‌ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని జగన్‌ ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు