/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Road Accident in Chittoor : చిత్తూరు జిల్లా చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు.. శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉంది. అదే సమయంలో ఆ మార్గం గుండా వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా మృతుల్లో ఒక మహిళతో పాటు చిన్నారి కూడా ఉంది. బస్సు ప్రయాణీకుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లో గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.మృతులను వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి, కుమార్తె అద్వికగా పోలీసులు నిర్ధారించారు. వీరు బెంగళూరు నుంచి ట్యాక్సీ బుక్ చేసుకుని తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Follow Us