BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
ఆదివారం తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న టెంపోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్ను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.
మహారాష్ట్ర నందూర్బార్లోని అక్లకువా-మోల్గి రహదారిపై ఇవాళ ఘోర స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. దేవ్గోయ్ ఘాట్ వద్ద ఒక స్కూల్ బస్సు 100 నుంచి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా, దాదాపు 20 నుండి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్ ఫరీద్కోట్ జిల్లాలోని చాంద్భన్ గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న హోండా సిటీ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు మహిళలు, 11 ఏళ్ల చిన్నారి మరణించారు.