/rtv/media/media_files/2026/03/31/gold-gifts-disappear-from-durga-temple-2026-03-31-21-15-36.jpg)
Gold gifts disappear from Durga temple
Durga temple : బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్ గోల్డ్‌ను కావాలనే పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పటివరకు ఒక లక్షా 25వేల బంగారం కొట్టేసినట్టు తేలింది. ఈ గోల్డ్ చోరీ వ్యవహారంపై దేవస్థానం ఈఓ సీరియస్ అయ్యారు. సంబంధిత సిబ్బందికి మెమోలు ఇచ్చారు. చోరీపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
గుడిలో ఇలా జరగడం నాలుగోసారని ట్రస్ట్ బోర్డు సభ్యులు అంటున్నారు. తొలుత కానుకల లెక్కింపు తర్వాత పక్కన పెట్టిన వేస్టేజ్‌పై బోర్డుసభ్యులకు అనుమానం వచ్చింది. ఈఓ శీనా నాయక్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఎస్పీఎఫ్, స్థానిక పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విషయంలోకి చోరీ జరుగుతున్న విషయం బయటపడింది. దుర్గగుడిలో ఇలా జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలునాలుగోసారి వెలుగులోకి రావడం గమనార్హం. హుండీ లెక్కింపులో పారదర్శకత లోపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవడం భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
భక్తుల కానుకల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం కేవలం నైతిక వైఫల్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు దెబ్బగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం ప్రతిష్టను కాపాడాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, హుండీ లెక్కింపు విధానాన్నిసాంకేతికంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గుడిలో కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు సూచిస్తున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా వచ్చిన వేస్టేజ్ లో బంగారం ఉన్న వ్యవహారంపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో నాయక్ చెప్పారు
Follow Us