/rtv/media/media_files/2026/03/30/senior-maoist-leader-chelluru-narayana-rao-surrenders-to-andhra-pradesh-police-2026-03-30-12-47-15.jpg)
Senior Maoist leader Chelluru Narayana Rao surrenders to Andhra Pradesh Police
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో ఏపీ మావోయిస్టుల కథ ముగిసిపోయింది. ఇప్పటిదాకా ఏపీకి చెందిన మావోయిస్టులు వరుసగా సరెండర్ అవుతూ వస్తున్నారు. మిగిలిన ఒకే ఒక్క కీలక నేత చెల్లూరు నారాయణరావు కూడా తాజాగా తన దళంతో కలిసి డీజీపీ ముందు లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు AOB రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. గతంలో పలు హోదాల్లో కూడా పనిచేశారు.
Also Read: గ్యాస్, పెట్రోల్ కొరతను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. కిరోసిన్ పంపిణీ ప్రారంభం
మావోయిస్టు పార్టీ కీలక నేతల్లో చాలావరకూ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతూ వస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు ఇటీవల ఏపీ పోలీసులకు టచ్‌లోకి వచ్చారు. సంప్రదింపులు జరిగిన అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోయారు.1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరించిన ఏపీ మావోయిస్టుల ఉనికి శున్యమైపోయింది.
ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్లతో మావోయిస్టులపై కాల్పులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఏపీ-ఒడిశా బోర్డర్ (AOB) రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగిపోడవం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: విశాఖలో దారుణం.. లవర్ ను చంపి ఫ్రిజ్ లో సగం శవాన్ని దాచి..
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టులను లేకుండా చేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. వీళ్లను అంతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు చేపట్టారు. మార్చి 31లోపు మావోయిస్టులు లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ కూడా చాలాసార్లు ప్రకటించారు. మొత్తానికి ఆరోజు రానేవచ్చింది. రేపటితో ఈ గడువు ముగియనుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోయారు. కేంద్రం తన లక్ష్యాన్ని చేరుకుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us