Crime News : విజయవాడలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా  బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

New Update
rape

Auto driver rapes young woman

 Crime News :  పోలీసులు, చట్టం, న్యాయస్థానాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా మనిషిలో మార్పు రావడం లేదు. మహిళలపై అత్యాచారాల పరపరం ఆగడం లేదు. ఒంటరిగా కనపడితే చాలు కామంధులు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా కామవాంఛలు తీర్చుకుంటున్నారు. ఒంటరిగా చిక్కితే చాలు.. అత్యాచారాలకు తెగపడుతున్నారు. విజయవాడలోను అలాంటి ఘటనే కలకలం రేపింది. విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా  బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

 అనంతరం ఆమెను అక్కడే వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి ఆటోతో సహా పరారయ్యాడు. తనపై జరిగిన దారుణానికి ఏడుస్తూ బాధితురాలు ఇంటికి  చేరింది. అక్కడ తనకు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. షాక్‌కు గురైన బాధిత కుటుంబం వెంటనే మాచవరం పోలీసులను ఆశ్రయించింది.  అక్కడ తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.  బాధిత యువతి చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఆటో డ్రైవర్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు