/rtv/media/media_files/2026/04/01/amaravati-2026-04-01-14-30-15.jpg)
లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతికి బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై దాదాపుగా రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం లోక్ సభ స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. కాగా గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందకు వెళ్లనుంది.అనంతరం రాష్ట్రపతి ముందుకు బిల్లు వెళ్లనుంది.
అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్..#HistoricAmaravatiResolution#LokSabha#Amaravati#AndhraPradeshpic.twitter.com/JyCxxjgIuA
— TDP Punch (@tdp_punch) April 1, 2026
సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్
సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతినే అని స్పష్టం చేశారు. ఇక దాన్ని ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని అన్నారు. గత పాలకులు అమరావతి విధ్వంసం చేశారని సీఎం ఆరోపించారు. అమరావతి ఎడారి అని, శశ్మానమంటూ ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరు సభలో సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. మరోవైపు... తల్లికి వందనం నిధులను జూన్ లో రిలీజ్ చేస్తామని సీఎం ప్రకటించారు.
కాగా రాష్ట్ర విభజన అనంతరం 2014-2019 మధ్య కాలంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించారు. అయితే, 2019లో అధికార మార్పిడి తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ గత మార్చి 28న ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి, అందులో అమరావతి పేరును రాష్ట్ర నూతన రాజధానిగా చేర్చాలని కేంద్రాన్ని కోరింది. ఆ విన్నపాన్ని మన్నిస్తూ కేంద్రం నేడు ఈ చట్టసవరణ ప్రక్రియను చేపట్టింది.
Follow Us