/rtv/media/media_files/2026/03/11/rain-alert-2026-03-11-20-56-23.jpg)
Rain Alert for Telangana
Weather Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవడం, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశంఉందని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వీటితో పాటు విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో బయట తిరగొద్దని కోరారు. మంగళవారం నాడు పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. విజయనగరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఉందనుందని తెలిపారు.అలాగే 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందనీ తెలిపారు. మరో 13 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మంగళవారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కుండపోత వాన కురిసింది.ఉరుములు, మెరుపులతో వరుణుడి బీభత్సం సృష్టించాడు. ఈదురు గాలుల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది.మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం కురిసింది.మణికొండ,గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్..రాజేంద్రనగర్, అత్తాపూర్, ఆరాంఘర్‌లోనూ భారీగా వర్షం పడింది. ---వర్షంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Follow Us