AP: వల్లభనేని వంశీ, మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్...
వైసీపీ నేత వలంలభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వైసీపీ నేత వలంలభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం కాలి బూడిద అవుతోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్‌పోస్టులు పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. డొక్కా సీతమ్మ పథకంలో ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే మెనూలో మార్పులు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తామన్నారు నాదేండ్ల మనోహార్.
జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్లేనని ప్రజలు భావించారన్నారు. జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతంలో వాగు సెంటర్ వద్ద బైక్ మీద వెళ్తున్న ఇద్దరి యువకులపై బ్లేడు బ్యాచ్ దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన యువకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.