AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update
Breaking: ఏపీ మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం.. జూలై ఒకటి నుంచి ప్రక్రియ మొదలు..!

CM Chandrababu key announcement on AP DSC notification

AP Govt Jobs: అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandra babu) చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ(DSC Notification) నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని పర్యవేక్షించాలని తెలిపారు. 

అప్పుడే తల్లికి వందనం పథకం..

ఈ మేరకు గురువారం కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రులతో కీలక అంశాలు చర్చించారు. 2025-26 విద్యా సంవత్సరం మొదట్లోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని పనులు ప్రారంభించాలని మంత్రులకు సూచించారు. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యేలోపు డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలన్నారు. 

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా..

అందరూ గేరు మార్చాలని, మొదటి 6 నెలలు మంత్రుల పనితీరును పట్టించులోనేదుకానీ ఇక ఎవరినీ ఉపేక్షించనని హెచ్చరించారు. ఇక ఆప్కోస్‌ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా నియమించాలన్నారు. అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని మంత్రులకు తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు, రాష్ట్రం ఇచ్చే మరో రూ.14 వేల అంశంపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. కేంద్రంతోపాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని భావిస్తోందన్నారు.  

Also Read :  Murder: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!

పోషకాలు కలిగిన సన్న బియ్యం..

బడి పిల్లలకు ఇకపై సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం(Mid Day Meals) పెట్టాలని ఏపీ క్యాబినెట్‌(AP Cabinet) నిర్ణయించింది. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్(IT Minister Nara Lokesh) ఆధ్వర్యంలో గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్‌(Cabinet Meeting) జరిగింది. ఇందులో నాణ్యమైన, పోషకాలు కలిగిన సన్న బియ్యం( ఫైన్ రైస్)తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆసక్తికర చర్చ జరిగింది. మోనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్‌లో లోకేష్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్ లో ప్రస్తావించారు.

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

నాణ్యమైన పోషకాలు..

సన్న బియ్యం (Fine Rice ) అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని క్యాబినెట్ ముందు ప్రస్తావించారు. ఇందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని నారా లోకేష్ కోరారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను మంత్రులు బలపరచి అంగీకరించారు. లోకేష్ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar)  మంత్రులకు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు