/rtv/media/media_files/2025/02/14/l4DxmBl1DMAmpQ5vio2c.jpg)
Court Remanded 14days to Vallabhaneni Vamsi
హైదరాబాద్‌లో వైసీపీ నేత వల్లభనేని వంశీ గురువారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనతోపాటు ఈరోజు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా వెంకట శివరామ కృష్ణప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేరార్చు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను మెడికల్ టెస్టుల కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
ముగ్గురికి 14 రోజుల రిమాండ్...
వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి అతణ్ణి విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వం తరుఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. దాని తర్వాత ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించారు.
పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను వంశీని కిడ్నాప్.. బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ వేగవంతం చేసారు. ఈ కేసులో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ఈ నెల 20న తీర్పు ఇవ్వనుంది. కానీ ఈలోపునే వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ రిమాండ్ లో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో అతను కీలక పాత్ర పోషించాడని తెలిపారు. చంపేస్తారని భయంతో సత్యవర్ధన్ వంశీ అనుచరులు చెప్పినట్టు చేసారని..సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. కేసులు ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారని చెప్పారు.
Also Read: TS: నగరంలో ట్రాఫిక్ ను నియంత్రణకు ఫ్లై ఓవర్లు- సీఎం రేవంత్ రెడ్డి