AP Crime News: యూట్యూబ్‌లో చూసి.. తండ్రిని చంపి.. కొడుకు డ్రామా చూస్తే షాకే..!

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో ఇటీవల విషాదం జరిగింది. కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు పులారావే తన తండ్రిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదాలే కారణమని తెలిపారు.

New Update
Son Killed Father ntr district

Son Killed Father ntr district

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల దారుణం జరిగింది. మైలవరం మండలం ములకలపెంట గ్రామానికి చెందిన కడియం శ్రీనివాస రావు ఈనెల ఎనిమిదో తేదీన హత్యాకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను హత్య చేశారు. అనంతరం మొక్కజోన్న తోటలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

దీంతో భూ తగాదాలే తన తండ్రి హత్యకు కారణమని మృతి చెందిన శ్రీనివాస రావు కొడుకు పుల్లారావు ఆరోపించాడు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు, అతని అనుచరులే తన తండ్రిని హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దర్యాప్తులో విస్తుపోయే నిజాలు

పుల్లారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తండ్రి శ్రీనివాస్‌ను కొడుకు పుల్లారావే హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. యుట్యూబ్‌లో చూసి తండ్రి హత్యకు పథకం రచించాడని పోలీసుల విచారణలో తేలిందని అన్నారు. ఆస్తి విషయంలో గొడవ జరిగిన సమయంలో తండ్రి శ్రీనివాసరావును కొడుకు పుల్లారావు కొట్టి చంపాడని నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు.

Also Read: Fastag: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

ఆన్లైన్ బెట్టింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని పుల్లారావు అప్పులపాలైయ్యాడని, అప్పులు తీర్చడానికి తండ్రి శ్రీనివాసరావు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు. ఈ కేసును తప్పు దోవ పట్టించేందుకు పుల్లారావు పక్క పొలం చల్లా సుబ్బారావుతో గతంలో ఉన్న సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని ఏసిపి తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.

Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారని పుల్లారావు భార్య ఆరోపిస్తోంది. తన మామకు, భర్తకు ఎలాంటి గొడవలు లేవని ఆమె చెప్పడంతో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తను అధికారపార్టీ ఒత్తిడితోనే అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన చెందుతున్నారు.

Also Read: Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!

ఇక ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన మైలవరం సిఐ దాడి చంద్రశేఖర్, మైలవరం ఎస్సై కె.సుధాకర్, జి కొండూరు కె.సతీష్ కుమార్, గంపలగూడెం ఎస్సై శ్రీనివాస్ లు, సిబ్బందిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారని ఏసిపి వై ప్రసాదరావు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు