![bird flu telangana](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/11/uAsV03MEdVunhfwnqpkK.jpg)
Telangana govt key decision on bird flu
Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్‌పోస్టులు పెట్టి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపిస్తున్నారు.
లక్షలాది కోళ్ళు మృత్యువాత..
ఈ మేరకు ఏపీలో బర్డ్ ఫ్లూ భారీ స్థాయిలో విస్తరిస్తుండగా కోళ్ల వాహనాలను రానివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్ల్ ఫ్లూ ఆధిక స్థాయిలో ఉంది. కోళ్ల ఫారాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతుండగా తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. అలాగే తణుకు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు చనిపోయాయి. ఒక్కో కోళ్ల ఫారంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు చనిపోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కేజీ చికెన్ ధర 30 రూపాయలకే అమ్ముతున్నా ఎవరూ కొనట్లేదని వాపోతున్నారు.
ఇది కూడా చదవండి: JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్
ఇక పౌల్ట్రీల్లో చనిపోయిన కోళ్ల శాంపిల్స్ సేకరించి పుణె ల్యాబ్కు పంపించారు అధికారులు. కోళ్లు ఎక్కడ చనిపోయినా పశు సంవర్ధక శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. అలాగే ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడం తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్పారు.