ఆంధ్రప్రదేశ్ AP: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్ వైసీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో తాను డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేలుస్తామన్నారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..? నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాగులో చిక్కుకున్న 27 మంది కూలీలు..! కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా 27 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. గంజిహళ్లి సమీపంలోని మల్లెల వాగు ప్రవాహం ఎక్కువ ఉండటంతో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder Case : టీడీపీ నేత హత్య కేసులో వీడిన మిస్టరీ AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత నర్సింహులు నలుగురి సహకారంతో శ్రీనివాసులును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్! శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత వెళ్తుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీద్ను చంపిందెవరు? ఏపీ ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వాహీద్ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. లవ్ ఇష్యూలో బాలిక పేరెంట్స్ కిడ్నాప్ చేయించి చంపించారని వాహీద్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు సంబంధం లేదని బాలిక కుటుంబం చెబుతోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు.. వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ స్పందించారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు అప్పు చేసిన కొడుకు.. ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్! నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. బెట్టింగ్ కు బానిసైన కొడుకు చేసిన రూ. 2.40 కోట్ల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకున్నారు. 10 ఎకరాల భూమి, ఇల్లు, కల్లం అమ్మేసినా కూడా అప్పులు తీరకపోవడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn