/rtv/media/media_files/2024/12/28/uCtaPQXHzExxCmmNVfnH.jpg)
karnul accident
AP Crime: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున తీర్థయాత్రకు వెళ్తున్న వాహనం ఒకసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా మంత్రాలయ వేద పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రంలోని నరహరి తీర్థాల ఆరాధన కోసం తుఫాను వాహనంలో వెళ్తున్నారు. మంత్రాలయం నుంచి మంగళవారం రాత్రి బయలుదేరారు వాహనం సింధనూరు దగ్గరకు రాగానే ప్రమాదానికి గురైంది. ఈ వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు:
మృతులు అభిలాష్, సుజేంద్ర, హైవదనతోపాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో చెప్పులు వేసుకోవడం మంచిదేనా?
విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను చూసేందుకు ఆస్పత్రి వద్దకు తల్లిదండ్రులు చేరుకుంటున్నారు.ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని ఆస్సత్రి అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: డయాబెటిక్ పేషెంట్లు రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి