/rtv/media/media_files/2025/04/13/woLGxkvwOXrDnyJfRe4w.jpg)
anna lezhneva
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.
కాబోయే సీఎం లోకేషే.. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి సంచలన కామెంట్స్!
పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు.
lokesh cm Photograph: (lokesh cm)
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ భరత్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నాయకుడు భరత్ అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చక పోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అని సభాముఖంగా బల్లగుద్ది చెప్పారు.
ఇది కూడా చదవండి : లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!
టీడీపీలో ఫ్యూచర్ లీడర్ ప్రస్తుతం ఐటీ మినిస్టర్ లోకేషే అని భరత్ అన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్ వెళ్లారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతుండంగానే మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. Short News | Pages | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!
అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!
అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం