ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవడం కచ్చితమని చెప్పారు. ఎవరికి నచ్చినా.. నచ్చక పోయినా జరగబోయేది ఇదేనని యూరోప్ తెలుగు డయాస్పోరాలో సభాముఖంగా బల్లగుద్ది చెప్పారు. టీడీపీలో ఫ్యూచర్ లీడర్ ప్రస్తుతం ఐటీ మినిస్టర్ లోకేషే అని భరత్ అన్నారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్ వెళ్లారు.
Also Read: Kolkata: సంజయ్ రాయ్ శిక్షపై మమతా సర్కార్ అసంతృప్తి..కీలక నిర్ణయం
సీఎం చంద్రబాబు సీరియస్..
మంత్రి టీజీ భరత్ మాట్లాడిన మాటలకు ఆంధ్రా సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకొచ్చాము, ఏం మాట్లాడుతున్నారు అంటూ సమావేశం తర్వాత మంత్రి భరత్‌ను దెబ్బలాడినట్టు తెలుస్తోంది. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు, ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికినట్టు చెబుతున్నారు. మనం ఇక్కడికి ఎందుకొచ్చాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికిగానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా? అంటూ తిట్టినట్టు చెబుతున్నారు. ఇక మీదట ఎవరూ కూడా అనవసరంగా మాట్లాడకూడదని ఏపీ ముఖ్యమంత్రి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: USA:100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం..అధ్యక్షుడి చేతిలో తిరుగులేని ఆయుధం