ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇక మీదట ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిణామాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు జనాభా భారం.. .కానీ ఇప్పుడు ఆస్తి అని ఆయన అన్నారు. ఇంతకు ముందు వరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లం. కుటుంబసభ్యుల సంఖ్య అంతకంటే ఎక్కువున్నా... అంతే ఇచ్చేవాళ్ళం. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ చట్టం తీసుకువచ్చాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జనాభా తగ్గిపోతోంది. ఇది ప్రమాదకర సంకేతమని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read: Space X: అంతరిక్షంలో పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్..వీడియో వైరల్
Also Read : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
జనాభా తగ్గుముఖం పడుతోంది..
ఇప్పుడు జనాభా (Population) కావాలి. అందుకే కొత్త చట్టాలను తీసుకువస్తున్నాం. కనీసం ఇద్దరు పిల్లలుంటేనే స్థనిక ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తాం. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన చెప్పారు. 2026కు రాష్ట్ర జనాభా 5.38 కోట్లు ఉంటుందని అంచనా. 2031లో అది 5.42 కోట్లకు, 2036లో 5.44 కోట్లకు చేరుతుంది. ఆ తర్వత నుంచి జనాభా తగ్గిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. 2041లో జనాభా 5.42 కోట్లకు తగ్గిపోతుంది. అక్కడి నుంచి ఇంకా తగ్గుతూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుంది అని చంద్రబాబు తెలిపారు. 2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే (టోటల్ ఫెర్టిలిటీ రేట్-టీఎఫ్‌ఆర్)... 2051 నాటికి అది 1.07కి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయి ఏపీ సీఎం లెక్కలు చెప్పారు. ఇది ప్రమాదకరమని..ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు ఉంటేనే రాష్ట్రాన్ని సక్రమంగా నడపగలమని తెలిపారు. జనాభా కోసమే సంపద సృష్టిస్తున్నామని... తగ్గిపోతే అంతా ఎవరికి ఇవ్వాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో పెద్ద విమానాశ్రయాలు, విశాలమైన రహదారులు ఇలాంటివన్నీ ఉపయోగించుకోవడానికి మనుషులే ఉండరంటూ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Saif Ali Khan: సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్.. సీన్ టూ సీన్ వివరించిన నానీ
Also Read : వైట్ హౌస్ పై దాడికి యత్నం..భారత సంతతి యువకుడికి 8 ఏళ్ల జైలు!