ఆంధ్రప్రదేశ్ Arogyasri Bills: సూదికి, దూదికి డబ్బుల్లేవ్.. ఆరోగ్యశ్రీ సేవలకు ఆ ఆసుపత్రులు గుడ్ బై! ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1750 కోట్ల బకాయిలు అందేవరకూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. తమ దగ్గర సూదికి, దూదికి కూడా పైసల్లేవని, నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఎన్టీఆర్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేశాయి. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బిర్యానీ అనుకుంటే పస్తులు: చంద్రబాబు పాలనపై జగన్-VIDEO చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడని ప్రజలు ఆశపడ్డారని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ ఇప్పుడు పస్తులు ఉంటున్నారన్నారు. తానే సీఎంగా ఉండి ఉంటే.. రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల డబ్బులు విడుదల అయ్యి ఉండేదన్నారు. విశాఖ నేతలతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు By Nikhil 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..! విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా కడపలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి హేయమైన చర్య అని కొవ్వొత్తులతో నిరసన చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్! ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్ భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు మాజీ సీఎం జగన్ భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: MPDO కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ టీడీపీ నిరసన..! అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం MPDO కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా ఎంపీటీసీలను ఎన్నిక చేసిందని మండిపడ్డారు. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunita: హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో కలిశారు. వివేకా హత్య కేసు విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం దక్కేలా సహకరించాలని హోంమంత్రిని సునీత కోరినట్లు సమాచారం. By V.J Reddy 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మూగ జీవాలు అంటే ఈ పెద్దయానికి ఎంత ప్రేమో..! కడపలో మోహినూద్దిన్ అనే వ్యక్తి మూగ జీవాలపై అపారమైన ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. 2012 నుంచి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మూగ జీవాలకు పండ్లు, వాటర్ ట్యాంక్ నీళ్లు అందిస్తూ వస్తున్నారు. మూగ జీవాలపై మోహినూద్దిన్ చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: కడపలో మేఘా సంస్థ మట్టి దోపిడీ.. నిబంధనలకు విరుద్దంగా..! కడప జిల్లాలో మేఘా సంస్థ మట్టి దోపిడీపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు దక్కించుకున్న మేఘా సంస్థ.. మల్లెపల్లె, తోట్లపల్లి చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తోడేస్తుందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn