/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
AP Kadapa murder Husband killed wife
Husband killed wife: ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. వరుస హత్యలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు వణికిపోతుండగా తాజాగా భర్త చేతిలో మరో భార్య బలైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ మొదలవగా విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న ఆవిడను ఘోరంగా కడతేర్చాడు. మానవత్వం మరిచి కృరమృగంలా దాడిచేసి నరికి నకిరి చంపేశాడు. ఈ ఘటన కడపలో కలకలం రేపుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.
కత్తితో నరికి నరికి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం ఎస్సీ కాలనీకి చెందిన యర్రగుడి పాడు చెన్నకేశవ, భార్య సుజాత నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. స్థానికులు సర్ధిచెప్పినప్పటికీ వారు ఊరుకోలేదు. దీంతో భార్య మాటలకు కోపంతో రగిలిపోయిన చెన్నకేశవ క్షణీకావేవేశంలో సుజాతపై కత్తితో దాడి చేశాడు. ఆమెను పలు చోట్ల నరికడంతో అక్కడికక్కడే మృతి చనిపోయింది.
Also Read: భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
అయితే భార్య సుజాత చనిపోయినట్లు గుర్తించిన చెన్నకేశవ.. దగ్గరలోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న కమలాపురం సీఐ ఎస్.కె. రోషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భార్యను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో తేలుస్తామన్నారు.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...
kadapa | telugu-news | today telugu news