/rtv/media/media_files/2025/03/15/6MH4cesRLRCdgdiUFN3q.jpg)
vivekanada murder case Photograph: (vivekanada murder case)
ఈ మర్డర్ మిస్టరీకి ఆరేళ్లు..
ఆరేళ్లుగా ఓ మర్డర్ కేసు మిస్టరీ ఇంకా వీడట్లే.. చనిపోయింది సాధారణ వ్యక్తి కూడా కాదు. మాజీ ముఖ్యమంత్రి సొంత తమ్ముడు. అంతేకాదు పులివెందుల నుంచి రెండు సార్లు MLAగా, 2సార్లు కడప ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా పని చేసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయనే వై.ఎస్.వివేకానందరెడ్డి. 2019 మార్చి 14 తేదీన చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారం పూర్తిచేసుకుని పులివెందులలోని ఆయన స్వగృహానికి చేరుకున్నాడు. మార్చి 15 తెల్లవారుజాము 5గంటలకు వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్న అతని పీఏ కృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవలేదు.
దీంతో 6 ఆయన భార్య సౌభాగ్యమ్మకు పీఏ ఫోన్ చేశాడు. కొంతసేపటి తర్వాత వెనుక డోర్ తెరచి ఇంటిలోకి వెళ్ళి చూడగా రక్తపు మడుగులో వివేకానందరెడ్డి డెడ్‌బాడీ కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కుమార్తె డాక్టర్ సునీత కోరిక మేరకు ఆమె వచ్చేవరకూ ఆగి సాయంత్రం 4 గంటలకు ఆమె పర్యవేక్షణలో స్థానిక ఆసుపత్రుల వైద్యులు, రిమ్స్ వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. మార్చి 16 తేదీ ఉదయం పులివెందులలో వివేకానందరెడ్డి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి సమాధి పక్కనే ఖననం చేశారు. ఇది జరిగి ఆరేళ్లు అవుతుంది.
వివేకానందరెడ్డి చివరి రాజకీయ జీవితం
2009 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి YSరాజశేఖరరెడ్డి మరణించాడు. YS జగన్మోహన్ రెడ్డి అధిష్టానం మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి స్వంతంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. ఆ సమయంలో వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య కొన్నాళ్లు విభేదాలు వచ్చాయి. 2011లో పులివెందుల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వదిన విజయమ్మపై పోటీచేశాడు. ఆ ఎన్నికల్లో వివేకానందరెడ్డి 80వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొనాళ్ల తర్వాత రెండు కుటుంబాల మధ్య విభేదాలు తగ్గి కలిసిపోయారు. వైఎస్ వివేకానంద రెడ్డి 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయనున్నాడని వార్తలు వెలువడ్డాయి. వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాడు.
కుతురి న్యాయ పోరాటం
YSవివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి శనివారం నివాళులర్పించారు. పులివెందుల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబసభ్యులు నిబవాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... నా తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ యధేచ్ఛగా బటయ తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారన జరగట్లేదు ట్రైల్స్ నడవట్లేదు, న్యాయం దక్కుతుందా అని ప్రశ్నించారు.
ఈ కేసులో నిందితుల కంటే తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందని వైఎస్ సునీత అన్నారు. సీబీఐ మళ్ళీ విచారణ ప్రారంభించాలని కోరారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. సాక్షులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్ సునీత రెడ్డి స్పష్టం చేశారు.
వివేకానంద కేసులో బిగ్ ట్విస్ట్
వివేకానందరెడ్డి మొదట గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. తర్వాత పోలీసులు వైఎస్ వివేకానంద ఇంటిని పరిశీలించగా ఆయనది సహజ మరణం కాదని, హత్య అని తెలిపారు. మార్చి 15న సాయంత్రం చేసిన పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయనీ తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసింది. కడప అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సిట్‌కు నేతృత్వంలో సిట్ కింద 5 ఇన్వెస్టిగేషన్ టీంలు పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ సీఐడీ ఛీఫ్ అమిత్ గార్గ్ పర్యవేక్షిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పలువురిని సిట్ బృందం అరెస్టులు చేసింది.
నిందుతులెవరూ..?
ఈ కేసు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డితోపాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి.. మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. అయితే దస్తగిరి మాత్రం అప్రూవర్‌గా మారిపోయారు. దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయ్యారు కూడా. ఆరేళ్లుగా సీబీఐ విచారణను కొనసాగిస్తూనే ఉంది. అనేకమంది అనుమానితులను ఇప్పటికే విచారించింది సీబీఐ. మరోవైపు ఈకేసుతో సంబంధం ఉన్న పలువురు మరణించడం కూడా అనుమానాలకు దారి తీసింది.
అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వైఎస్ సునీత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. తన తండ్రి హత్యకు న్యాయం జరగడం కోసం పోరాడుతూనే ఉన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కేసులో ఉన్న వ్యక్తుల ఆరుగురి చావులు
వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన కారు డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబరులో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
వాచ్‌మన్ బి.రంగన్న మృతి
వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్‌మన్ బి.రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు. వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
వైఎస్ భారతి తండ్రి, జగన్‌మోహన్‌రెడ్డి మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. డా.వైఎస్ అభిషేక్‌రెడ్డి కూడా చనిపోయారు. వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు.