/rtv/media/media_files/2025/01/22/fFudwVwTuK7mXJNSBWu1.jpg)
Telangana High Court
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. 2019 మార్చి 14న అర్ధరాత్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద ఈ హత్య జరిగింది. తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలని ఆయన కూతురు సునీతా ఆరు ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. సుప్రీం కోర్టు, సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగిన ఆమె తాజాగా సునీతా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని ఆరు నెలల్లోగా ముగించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణపై తెలంగాణ హైకోర్టులో ఆయన కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!
హత్య జరిగి ఆరేళ్లు అవుతుందని, దాదాపు నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా.. పురోగతి ఏమీ లేదని సునీత తన పిటిషన్‌లో తెలిపారు. సీబీఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 2 ఛార్జిషీట్‌లు దాఖలు చేశారన్నారు. దాదాపు 15 నెలలుగా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌లో సునీత సీబీఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సీబీఐతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇచ్చేందుకు సునీత తరుపు న్యాయవాదికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.
Also Read: Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు