Pastor Praveen: సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అధిపతి.. వందలాది అనాథలకు ఆశ్రయం.. పాస్టర్ ప్రవీణ్ బ్యాగ్రౌండ్ ఇదే!

అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ స్వస్థలం కడప. సోదరుడితో గొడవల కారణంగా ఆయన హైదరాబాద్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. పలు ఐటీ కంపెనీలకు ఆయన అధిపతి అని.. వందల కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు

New Update

పాస్టర్ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రమాదంలో ఆయన చనిపోయారా? లేక ఎవరైనా ప్రాణాలు తీశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోగా.. హైదరాబాద్ లో అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరు ఎక్కడ? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? అన్న అంశంపై చర్చ సాగుతోంది. అయితే.. ప్రవీణ్‌ స్వస్థలం కడప. స్థానిక రాజారెడ్డి వీధిలో ఆయన కుటుంబం నివాసం ఉండేది. పట్టణంలోని CSI స్కూల్‌లో ప్రవీణ్‌ విద్యాభ్యాసం సాగింది.. అక్కడే ఇంటర్ పూర్తి చేశారు ఆయన.
ఇది కూడా చదవండి: Pastor Praveen: నా భర్త చాలా మంచోడు.. కన్నీరు పెట్టిస్తోన్న ప్రవీణ్ భార్య మాటలు!

పేరెంట్స్ ది ప్రేమ వివాహం...

ప్రవీణ్ తల్లిదండ్రులది ప్రేమ వివాహమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తల్లి మరియమ్మ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగి కాగా.. తండ్రి ముస్లిం. చిన్న నాటి నుంచే క్రైస్తవ మతం పట్ల ఇష్టం పెంచుకున్నారు ప్రవీణ్. సోదరుడితో గొడవ కారణంగా ఆయన హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయినట్లు సమాచారం. పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఆయన అధిపతి అని తెలుస్తోంది. అయితే.. కొన్ని రోజులుగా ప్రవీణ్‌ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: పాస్టర్ ప్రవీణ్ ను చంపింది వాడే.. నా దగ్గర ప్రూఫ్స్.. కేఏ పాల్ సంచలనం!-VIDEO

ప్రవీణ్‌ వందల కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని సమాచారం. వందల మంది అనాథలను ఆయన చేరదీశారని చెబుతున్నారు. తన పిల్లల్లానే అనాథలకు చదువులు చెప్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ద్వారా లబ్ధిపొందిన వందలాది మంది కడచూపు కోసం తరలివచ్చారన్న చర్చ సాగుతోంది. 

(Pastor Praveen | telugu-news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kodali Nani: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

కొడాలి నానికి సర్జరీ చేయనున్న డాక్టర్ రామకాంత పాండా చాలా ఫేమస్. ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా ఆయనే విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న వారిని సైతం బతికించి దేవుడయ్యారు.

New Update
Kodali Nani

Kodali Nani

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడ ఆయనకు మెరుగైన చికిత్స అందించనున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

అయితే ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించడం వెనుక ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు?.. ఇక్కడ డాక్టర్లు లేరా?.. అక్కడి డాక్టర్ అంత స్పెషలా?.. ఆ డాక్టర్ రికార్డ్స్ ఏంటి?.. ఇంతక ముందు ఎంతమందికి హార్ట్ సర్జరీలు చేశారు?.. పెద్ద పెద్ద ప్రముఖులకు హార్ట్ సర్జరీలు చేశారా? లేదా?.. అని చాలా మంది ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అనంతరం ఆయన రికార్డ్స్ చూసి అవాక్కవుతున్నారు. ఆయన వద్ద హార్ట్ సర్జరీలు చేయించుకున్న ప్రముఖుల లిస్ట్ చూసి ఖంగుతింటున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

డాక్టర్ రికార్డ్స్ ఇవే

ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్. రమాకాంత మదన్మోహన్ పాండా. ఈయనే కొడాలి నానికి ట్రీట్మెంట్ చేయనున్నారు. ఈయన ట్రాక్ రికార్డ్స్ చూస్తే వావ్ అనాల్సిందే. కొన్ని వేలమందికి ట్రీట్మెంట్ అందించారు. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లను సైతం ఆయన బతికించి ప్రాణాలతో బయటపడేశారు.

ఈయన ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లా, దామోదర్‌పూర్‌ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 3, 1954న జన్మించారు. ఒక రైతు కొడుకు. ఆయన MBBS చేయడానికి కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో చేరాడు. 1980 - 1985 మధ్య AIIMS ఢిల్లీలో శస్త్రచికిత్స, గుండె శస్త్రచికిత్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆపై తన ఫెలోషిప్ కోసం USAలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో చేరారు. అక్కడితో ఆగకుండా ఆయన UKలోని హేర్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో కార్డియాక్ సర్జన్ ఫ్లాయిడ్ లూప్, ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ మాగ్డి యాకౌబ్ కింద శిక్షణ తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అంతేకాకుండా డాక్టర్ రమాకాంత్ పాండా భారతదేశంలో "టోటల్ ఆర్టరీ రివాస్కులరైజేషన్"ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అలాగే "ఆఫ్-పంప్" బైపాస్ సర్జరీ, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ( CABG ), బీటింగ్ హార్ట్ సర్జరీ, రీడూ బైపాస్ సర్జరీ, వాల్వ్ రిపేర్, కాంప్లెక్స్ అనూరిజమ్స్ (హై-రిస్క్ సర్జరీలు) మార్గదర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. 

రామకాంత పాండా.. MCh, ఒక కార్డియాక్ సర్జన్. అంతేకాకుండా కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీకి చీఫ్ కన్సల్టెంట్ కూడా. డాక్టర్ పాండా 2002లో ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌ను స్థాపించారు. దాదాపు 30,000లకు పైగా విజయవంతమైన కార్డియాక్ సర్జరీలను చేశారు. వీటిలో 2,000 కంటే ఎక్కువ రెడూ సర్జరీలు, 6,000+ హై-రిస్క్ సర్జరీలు ఉన్నాయి. 

పద్మభూషణ్

ఆయన సేవలకు గానూ 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. బైపాస్ సర్జరీలో 99.8% విజయం సాధించడంతో ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్డియాక్ సర్జన్‌గా గుర్తింపు పొందారు. అతడు ఎంతో మంది రాజకీయ దిగ్గజాలకు సైతం సర్జరీలు నిర్వహించారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ప్రముఖ దిగ్గజాలకు సర్జరీ

2009లో అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అంతేకాకుండా దీని తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ , అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నరసింఘ మిశ్రా, పాండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు డి రాజా, రాజీవ్ శుక్లా, కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజు లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. వీరితో పాటు అనేక మంది భారత రాజకీయాల నాయకులకు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేశారు. 

(kodali nani | kodali nani aig hospital | kodali nani health update | latest-telugu-news | Dr. Rama Kanta Panda | andhra-pradesh)

Advertisment
Advertisment
Advertisment