Ap Crime: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం!

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్‌స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ బాలుడి తల్లిదండ్రులపై కూడా కేసు రిజిస్టర్ చేశారు.

New Update
Andhra Pradesh Kadapa POCSO case against 9th class student in Proddatur

Andhra Pradesh Kadapa POCSO case against 9th class student in Proddatur

9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తమ స్కూల్‌ బాలికల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేసి వారిని బెదిరించాడు. తనను ప్రేమించాలని లేకపోతే.. ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్ బయటపెడతానని బెదిరించాడు. ఈ విషయం ఆ స్టూడెంట్ తల్లిదండ్రులకు తెలిసినా వారు మందలించకపోగా.. ప్రోత్సహించారు. దీంతో ఆ స్టూడెంట్‌తో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు నమోదు అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

ఫొటోలు బయటపెడతా

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉన్న ఓ స్కూల్‌లో ఒక బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు సహచర బాలికల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేశాడు. అనంతరం వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్‌ను బయటపెడతానని ఆ బాలికలను వేధించాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ బాలుడిని స్కూల్ టీచర్లు నాలుగు రోజుల క్రితం మందలించి కొట్టారు. 

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

జరిగిన విషయాన్ని ఆ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పాడు. టీచర్లు తనను వేధిస్తున్నారంటూ తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సీఐ మద్దిలేటి, ఎంఈఓ సావిత్రమ్మ విచారణ చేపట్టారు. ఈ విచారణంలో వారికి విస్తుపోయే విషయాలు తెలిసాయి. బాలికల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేసి తమ ఫొటోలు, వీడియోలు, నెంబర్లను ఇతరులకు పంపించి వేధిస్తున్నాడనే విషయం బయటపడింది. 

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

అంతేకాకుండా దాదాపు 32 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు ఉన్నట్లు గుర్తించారు. వాటి ద్వారానే అతడు తనను ప్రేమించాలని లేదంటే నెంబర్లు, ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బాలికలకు అసభ్యకర మెసేజులు పంపించినట్లు తెలిసింది. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసినా మందలించకపోగా, ప్రోత్సహించడంతో పాటు బాలికలను బాలుడి తల్లి, కౌన్సిలర్ బెదిరించారని సమాచారం. దీంతో ఆ విద్యార్థితో పాటు అతడికి సహకరించిన తల్లిదండ్రులు, కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

(crime news | ap-crime-news | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment