/rtv/media/media_files/2025/03/25/MoEWOrkSTCWfGgjYDODN.jpg)
YSR Kadapa 10th class maths paper leaked on WhatsApp
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 10th పరీక్షలు జరుగుతున్నాయి. సజావుగా సాగాల్సిన పరీక్షలు.. లీకేజ్‌ల వ్యవహారంతో సంచలనంగా మారింది. రీసెంట్‌గా తెలంగాణలో జరుగుతోన్న పదో తరగతి ప్రశ్నాపత్రం లీకై చక్కర్లు కొట్టింది. మార్చి 21వ తేదీన నల్గొండ జిల్లాలోని నకిరేకల్ గురుకుల పాఠశాలలో పరీక్ష్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
కడపలో పేపర్ లీక్
అది మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో సైతం పేపర్ లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది. క్వచ్చన్ పేపర్ ఏకంగా వాట్సాప్‌లలో పరుగులు పెట్టింది. వైఎస్సార్ కడప జిల్లాలోని వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో పరీక్షలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. దీంతో అప్పడే 10వ తరగతి గణితం పేపర్ లీకైనట్లు తెలిసింది. అది వాట్సాప్ ద్వారా పలు నంబర్లకు షేర్ అయినట్లు గుర్తించారు.
దానిపై అధికారులు ఆరా తీయగా.. స్కూల్లోని వాటర్ బాయ్ ఇందులో ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. అతడు విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని తన వాట్సాప్ ద్వారా స్థానికంగా ఉండే వివేకానంద స్కూల్‌లో పని చేస్తున్న విఘ్నేశ్వర రెడ్డి అనే వ్యక్తికి షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో పోలీసులు ఆ వాటర్ బాయ్‌పై కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశారు. ఇక విచారణ అనంతరం అధికారులు పలువురిని సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
(telugu-news | latest-telugu-news | 10th Exam Paper Leak | 10th Exam Paper Leak Case | 10th exam paper leak 10th exam paper leak in nalgonda )