Ap 10th Exam Paper Leak: ఏపీలో 10th పేపర్ లీక్.. డీఈవోకు బెదిరింపులు!

కడప జిల్లాలోని వల్లూరుస్కూల్లో 10th గణితం పేపర్‌లీక్ వ్యవహారంలో DEO ముగ్గురని సస్పెండ్ చేశారు. దీంతో డీఈఓను కొందరు బెదిరించినట్లు తెలుస్తోంది. కేసునమోదు చేయడం, విచారణ వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటామని విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని హెచ్చరించినట్లు తెలిసింది.

New Update
YSR Kadapa 10th class maths paper leaked on WhatsApp in AP

YSR Kadapa 10th class maths paper leaked on WhatsApp in AP

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కడప జిల్లాలో రీసెంట్‌గా పదోతరగతి ఎగ్జామ్‌ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థులకు గణితం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే పేపర్ లీక్ అయి వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో డీఈవో షంషుద్దీన్.. చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామ కృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం. రమణ వంటి ముగ్గురుని సస్పెండ్ చేశారు.

డీఈవోకు బెదిరింపులు

దీంతో సస్పెండ్ చేసిన డీఈవోకు తాజాగా బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. పలువురు వ్యక్తులు డీఈవోపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. పోలీసులు కేసు నమోదు చేయడం, విచారణ వంటి వాటిపై తాము రాజకీయంగా చూసుకుంటామని..

ఇంతటితో విద్యాశాఖ సైలెంట్ అవ్వాలని, లేకపోతే జిల్లావిద్యాశాఖ అధికారులే లక్ష్యంగా ముందుకెళతామని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీని బట్టి చూస్తే ఈ పేపర్ లీక్ వెనక పెద్ద పెద్ద తలకాయాలే ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు దారితీస్తుందో.

ఏం జరిగింది?

వైఎస్సార్ కడప జిల్లాలోని వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు తనిఖీ చేశారు. దీంతో అప్పుడే 10వ తరగతి గణితం పేపర్ లీకైనట్లు తెలిసింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలో గణితం పేపర్ వాట్సాప్‌లో దర్శనమిచ్చింది. ప్రశ్నపత్రం ఓ వ్యక్తి నేరుగా డీఈవో షంషుద్దీన్‌కు పంపించడంతో ఆయన ఆ ప్రశ్నపత్రంలోని క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా గుర్తించారు.

దీంతో వల్లూరు మండలంలో ఒకటి, వేంపల్లె మండలంలో రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అండతో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. పరీక్ష మొదలైన నిమిషాల వ్యవధిలో వల్లూరు పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాయ్ సాయిమహేష్, విఘ్నేశ్వర రెడ్డి అనే ఉపాధ్యాయుడు వెళ్లి ప్రశ్నపత్రం ఫొటో తీసి, వాట్స్‌యాప్ ద్వారా వేంపల్లెలోని కొంతమంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు చేరవేస్తున్నారని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. పశ్నపత్రం లీకు వ్యవహారంలో చీఫ్ సూపరింటెండెంట్ ఎం.రామ కృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్ ఎం. రమణను డీఈవో సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే డీఈఓ షంషుద్దీన్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.

(10th Exam Paper Leak | 10th Exam Paper Leak Case | 10th paper Leak case | SSC Exam 2025 paper leak | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు