ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్..! వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయం నేడు గర్వంతో నిండే రోజు అని అన్నారు. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..! మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్(ANTF) ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్‌గా ఐజీ రవికృష్ణను నియమించింది. డ్రగ్స్, గంజాయిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ ANTF పని చేయనుంది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం'.. అంబటి ఆసక్తికర ట్వీట్.! 'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం' అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రివంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. By Jyoshna Sappogula 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : ఇక ఉరుకోము.. మాజీ సీఎం జగన్‌కు మంత్రి లోకేష్ హెచ్చరికలు AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను మంత్రి లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కొరకు పనిచేశారనే కక్షతోనే వైసీపీ వాళ్ళు హత్యచేశారని ఆరోపించారు. ఓటమి తరువాత జగన్ అండ్ కో ఇలాంటి దాడులకు పాల్పడుతోందని.. నిందితులను విడిచి పెట్టేదిలేదని హెచ్చరించారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష AP: ఐటీ-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.కాగా విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Drugs case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. మస్తాన్ సాయి అరెస్ట్! రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయిని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 24న విజయవాడలో డ్రగ్స్ దొరకగా.. ఈ కేసులో మస్తాన్ ను పోలీసులు A4గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ చేశారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే...కొత్త జంటకు రేషన్ కార్డు! రాష్ట్రంలో కొత్త రేషన్ కార్టుల జారీ ప్రక్రియ త్వరలోప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు.జగన్ బొమ్మ, వైసీపీ రంగులతో ఉన్న కార్డులను కూడా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. By Bhavana 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn