ఏపీలో కొత్త వైరస్ కలకలం.. గుంటూర్‌లో తొలి మరణం

ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది. గుంటుర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కమలమ్మ జీబీఎస్ వైరస్ బారిన పడి ఆదివారం చనిపోయింది. ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు కమలమ్మ 10 రోజులుగా చికిత్స తీసుకుంది.

New Update
Guillain Barre syndrome virus

Guillain Barre syndrome virus Photograph: (Guillain Barre syndrome virus)

ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గుంటురు గవర్నమెంట్ హాస్పిటల్‌లో కమలమ్మ అనే మహిళ ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడి ఆదివారం చనిపోయింది. 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆదివారం చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆమెది ప్రకాశం జిల్లా కోమరఓలు మండలం ఆలసందపల్లి గ్రామస్తురాలు. తీవ్ర జ్వరం, కాల్లు చచ్చుబడిపోయి, ఇతర లక్షణాలతో ఫిబ్రవరి 3న గుంటురు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరింది.

Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

టెస్టులు చేసిన వైద్యులు ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు చెప్పారు. రెండు రోజులుగా లక్షణాలు తీవ్రత ఎక్కవైంది. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆమె మరణించింది. ఈ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రమదకరమైన వైరస్ కానప్పటికీ వ్యాధి ముదిగితే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. గత నెలరోజు క్రితం ముంబై, పూణేలో కూడా 170 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రాలో గులియన్ బారే సిండ్రోమ్ వైసర్ సోకి 8 మంది చనిపోయారు. ఈ వ్యాధి ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. క్రమక్రమంగా మనిషిని క్షీణింపచేస్తోంది.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. కరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది.

New Update
_Private bus overturns

_Private bus overturns

AP Crime: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద ఉదయం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటలుగా ఓ మహిళను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బస్సు పూర్తిగా బోల్తా పడటంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టం అయినప్పటికీ.. సహాయక బృందాలు నిపుణుల సహాయంతో క్షుణ్నంగా చర్యలు చేపడుతున్నాయి.

వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి..

గాయపడిన ప్రయాణికులను వెంటనే నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు

సంఘటనాస్థలంలో ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులు చిందిపోవడం, గాయాలపాలైన  వారు విలవిల్లాడటం అక్కడి దృశ్యాలు అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి బాధితులను రక్షించేందుకు కృషి చేశారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను అందించేందుకు జిల్లా వైద్య శాఖ సన్నద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సుల వేగం, నిర్వహణపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment