/rtv/media/media_files/2025/02/09/TgXXzRyf9FvhcczSzBI6.jpg)
Kiran Royal
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్‌ను దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్‌పై వ్యక్తిగత ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ నుంచి దూరం చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.
జనసేన కీలక నిర్ణయం..
— Crick Movie News (@Crickmovienews) February 9, 2025
పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ ను దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ
గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణలు
ఈ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకునే వరకూ పార్టీ నుంచి దూరం చేస్తున్నట్లు ప్రకటన చేసిన జనసేన pic.twitter.com/oe0vIq040M
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన
అలాగే ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి.. సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టాలని జనసేన శ్రేణులకు సూచనలు చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. కిరణ్ రాయల్ చేసిన మోసం గురించి చెబుతూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో సంచనలం రేపిన సంగతి తెలిసిందే.
Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కొట్టేసి తనను ఆర్థిక ఇబ్బందుల్లో పడేశాడని.. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు లక్ష్మీ అనే మహిళ ఆ వీడియోలో మాట్లాడింది. ఆ తర్వాత బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న మరో వీడియో కూడా బయటపడింది. దీంతో ఆయన ఇంటిని మహిళలు ముట్టడించారు. కిరణ్ రాయ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన.. ఆయన్ని పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!