Anchor Shyamala: తొక్కి నార ఎప్పుడు తీస్తావ్.. పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Shyamala) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నేను అధికారంలోకి వస్తే మహిళల గురించి అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తా అంటూ అప్పట్లో ప్రగల్బాలు పలికారు. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. కిరణ్ రాయల్ ను తొక్కి నారా తీస్తారా లేదా అని పవన్ ను శ్యామల ప్రశ్నించింది.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అన్నా అని కేకలు వేసినా.. గగ్గోలు పెట్టినా.. గొంతెత్తి అరచినా ఎవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వంలో ఆడపిల్లలకు ఎంతో మంచి రక్షణ ఉండేది దిశా యాప్ ద్వారా మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కాదు.ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పెద్దవారు ముసలివారు అని తేడా లేకుండా అందరిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల వెల్లడించారు. జనసేన నేత కిరణ్ రాయల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసిన పట్టించుకునే వారు లేరు అంటూ ఫైర్ అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలే మహిళలపై ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ శ్యామల ప్రశ్నించారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు. కానీ ప్రస్తుతం తప్పు చేసిన వారు కూడా కాలర్ ఎగరేసుకొని మరి మాట్లాడుతున్నారు అంటూ శ్యామల కిరణ్ రాయల్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం (NDA Government) ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. మహిళలపై అఘాయిత్యాలను ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుపతి జనసేన ఇన్ చార్జ్ అయిన కిరణ్ రాయల్ పై తాజాగా లక్ష్మీ అనే మహిళ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా కిరణ్ రాయల్ వార్తలలో నిలిచారు. తన వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని, తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది. దీంతో కిరణ్ రాయల్ అంశం రాష్ర్టంలో చర్చనీయంశంగా మారింది. ఈ ఆరోపణలపై ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ కిరణ్ రాయల్ కొద్ది రోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలను కూడా జారీ చేశారు.

Shyamala

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
Also Read : రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి
Anchor Shyamala Counter On Pawan Kalyan
గత ప్రభుత్వంలో ఆడపిల్లలకు ఎంతో మంచి రక్షణ ఉండేది దిశా యాప్ ద్వారా మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కాదు.ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పెద్దవారు ముసలివారు అని తేడా లేకుండా అందరిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల వెల్లడించారు. జనసేన నేత కిరణ్ రాయల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసిన పట్టించుకునే వారు లేరు అంటూ ఫైర్ అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలే మహిళలపై ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంటే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ శ్యామల ప్రశ్నించారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు. కానీ ప్రస్తుతం తప్పు చేసిన వారు కూడా కాలర్ ఎగరేసుకొని మరి మాట్లాడుతున్నారు అంటూ శ్యామల కిరణ్ రాయల్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
కూటమి ప్రభుత్వం (NDA Government) ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. మహిళలపై అఘాయిత్యాలను ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుపతి జనసేన ఇన్ చార్జ్ అయిన కిరణ్ రాయల్ పై తాజాగా లక్ష్మీ అనే మహిళ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా కిరణ్ రాయల్ వార్తలలో నిలిచారు. తన వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని, తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది. దీంతో కిరణ్ రాయల్ అంశం రాష్ర్టంలో చర్చనీయంశంగా మారింది. ఈ ఆరోపణలపై ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ కిరణ్ రాయల్ కొద్ది రోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలను కూడా జారీ చేశారు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
TG Crime: నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి
Supreme Court: రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
NewYork: న్యూయార్క్ లో విమాన ప్రమాదం...!
Rice: బియ్యాన్ని వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు
🔴Live Breakings: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ