/rtv/media/media_files/2025/01/06/Z0AweVllvjDZuf0idKtX.jpg)
AP Guntur 'Gulian Bari Syndrome' 7 cases positive
New Virus: ఏపీ గుంటూరు(Guntur)లో కొత్త వైరస్ విజృంభిస్తోంది. జీజీహెచ్‌లో 'గులియన్ బారి సిండ్రోమ్' (GBS) బాధితులు పెరుగుతున్నారు. ఈ ఉదయం ఒకరికి సోకినట్లు వెల్లడించిన వైద్యులు మధ్యాహ్నం వరకు మరో 6 కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం 7గురు జీబీఎస్ వ్యాధి బారినపడ్డట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
ఇద్దరి పరిస్థితి విషమం..
ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా ఒకరు వెంటిలేటర్‌పై, మరొకరు ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాధారణ వార్డులో చికిత్స పొందిన ఐదుగురు బాధితుల్లో చికిత్స అనంతరం ఇద్దరినీ డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు బాధితులు సంఖ్య పెరగటంతో అధికారులు, వైద్య బృందాన్ని అప్రమత్తం చేశారు.
ఇది కూడా చదవండి: AP Schools: మా బడి మాకు కావాలి.. MEO ఆఫీస్ ముందు గ్రామస్తుల నిరసన!
ఈ మేరకు న్యూరాలజీ వార్డును పరిశీలించిన క్రిష్ణబాబు ప్రభుత్వ సంసిద్ధత, జీజీహెచ్‌లో చేసిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ఇది కొత్త వ్యాధి కాదు. లక్ష కేసుల్లో ఒకటి రెండు కేసులు నమోదవుతాయి. పుణేలో అధిక కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నాం.
ప్రతి నెలా పది పదికొండు కేసులు రావటం సాధారణమే. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శానిటేషన్ మెయింటైన్ చేసుకోవాలి. తప్పుగా ప్రచారం చేయవద్దు. అసాధారణ పరిస్థితి ఏమీ లేదు. ఇమ్యూనో గ్లోబిన్ ఇన్ జంక్షన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి: బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్