/rtv/media/media_files/2025/02/10/0BWNwPASrRjnsXdAK2b7.webp)
Ram Gopal Varma
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒక కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన ఆర్జీవీకి సీఐడీ(CID) అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు సీఐడీ పోలీసులు(Guntur CID Police) ఈనెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనగా అందుకు ఆర్జీవీ 8 వారాల పాటు గడువు కోరారు. అయితే దీనిపై సీఐడీ అధికారులు(CID Officers) ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Lokesh)లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో ఆర్జీవీ పోలీసుల విచారణకు సైతం హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీసులు(Ongole Rural Police) ఆర్జీవీని దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇలా ఉండగానే మరో కేసులో ఆర్జీవీకి నోటీసులు అందడంతో గడువు కోరారు.
Also Read: HAJJ 2025: హజ్ యాత్రకు వెళ్లే ఇండియన్స్‌కు బిగ్ షాక్.. మారిన రూల్స్!
నేడు రామ్ గోపాల్ వర్మ సీఐడీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరుకాలేనని సీఐడీ అధికారులకు వెల్లడించారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని...ఈ నెల 28న సినిమా విడుదల ఉండటంతో తీరిక లేదని స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు 8 వారాల సమయం కావాలని...ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు విచారణకు హాజరవుతానని సీఐడీ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావుకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
దర్శకుడు ఆర్జీవీ 2019లో అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తీశారు. ఈ మూవీ పేరు తొలుత కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఉండగా పలువురు అభ్యంతం చేయడంతో అమ్మరాజ్యంలో కడప రెడ్లుగా మార్చారు. అయితే ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని గత ఏడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!
ఒంగోలు రూరల్ పీఎస్‌కు ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆయన చేసే పోస్టులు అగ్గిరాజేస్తాయి. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ల మార్ఫింగ్ ఫొటోల కేసు ఆర్జీవీకి చుక్కలు చూపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌లో విచారణ చేపట్టారు. మొత్తం 50 ప్రశ్నలను పోలీసులు సంధించినట్లు తెలుస్తోంది. అయితే 44 ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పినట్లు సమాచారం. ఈ విచారణ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
తాజా కేసు వివరాల్లోకి వెళితే... 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో ఒక సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం టైటిల్ పై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే పేరుతో సినిమాను విడుదల చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్ కు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారని చెప్పారు. దీంతో, మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్ లో నవంబర్ 29న కేసు నమోదయింది. ఈ క్రమంలో, ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు అందించారు. ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా... ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఆర్జీవీకి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమైంది.
Also Read: ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!