🔴Live Breakings: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 18, 2025 15:56 IST

    విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు!

    మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

    Vijayasai Reddy
    Vijayasai Reddy

     



  • Mar 18, 2025 07:58 IST

    ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్.. మూడు కేటగిరీలుగా ఎస్సీలు

    అనేక ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణకు ఏపీ సర్కార్‌ అమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్‌రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదికతో పాటు మంత్రుల కమిటీ నివేదికపై కేబినెట్‌ చర్చించింది.

     sc classification
    sc classification

     



  • Mar 18, 2025 07:57 IST

    తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

    తెలంగాణకు ప్రస్తుత సీఎస్ గా ఉన్న శాంతి కుమారి పదవీకాలం వచ్చే నెల ఏప్రిల్ తో ముగిస్తోంది ఈ నేపథ్యంలో తర్వాతి సీఎస్ గా కె. రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

    ts
    K. Rama Krishna Rao

     



  • Mar 18, 2025 07:57 IST

    మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మరోసారి పెరగనున్న ధరలు

    ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరేసీ బజ్జుందామనుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. అదెంటంటే తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ పాటికే మద్యం వ్యాపారస్తులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

    liquor



  • Mar 18, 2025 07:56 IST

    మధ్యప్రదేశ్‌లో దారుణం.. క్రైమ్ షోలు చూసి భార్యను ఏం చేశాడంటే?

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త భార్యను దారుణంగా చంపాడు. వరకట్నం కోసం ఆమెను వేధిస్తూ హతమార్చాడు. అయితే క్రైమ్ షోలు చేసి దారుణంగా హతమార్చి దాన్ని ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా స్టోరీ మలిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.



  • Mar 18, 2025 07:56 IST

    నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం.. కాలయములవుతున్న కన్నతండ్రులు!

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది.



  • Mar 18, 2025 07:55 IST

    నాగ్ పూర్ లో ఉద్రిక్తత.. ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

    నాగ్ పూర్ లోని ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ మహారాష్ట్రలోని వీహెచ్ పీ నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిమ్ ల పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాపించడంతో రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డాయి. 



  • Mar 18, 2025 07:55 IST

    తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

    తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు.

    Tirumala Ap
    Tirumala Ap Photograph: (Tirumala Ap )

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు