🔴UNION BUDGET 2026 LIVE UPDATES: నేడే కేంద్ర బడ్జెట్.. తగ్గేవి, పెరిగేవి ఇవే!
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారు. దేశాన్ని బయోఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. ఇండియాని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ కేంద్రంగా మార్చేందుకు బయోఫార్మా శక్తి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
బడ్జెట్ అంటే కేవలం రాబడి-ఖర్చుల పద్దు మాత్రమే కాదు.. అది దేశ సంస్కృతిని, రాజకీయ వ్యూహాలను కలిపి చెప్పే ఒక వేదిక. ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్ హాల్లోకి ఆమె వేసిన అడుగుతోనే సంచలనంగా మారింది.
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 ఒక చారిత్రాత్మక మార్పుకు వేదిక కానుంది. గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగ శైలిని పక్కన పెడుతూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి సరికొత్త పంథాను అనుసరించబోతున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
మరి కొన్ని గంటల్లో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇది డిఫెన్స్ రంగంలో గేమ్ ఛేంజర్ కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధంలో పాత పద్దతుల నుంచి AI టెక్నాలజీ యుద్ధ రంగానికి భారత్ మారుతున్న క్రమంలో ఈ బడ్జెట్ అత్యంత కీలకం కానుంది.
భారతదేశ పన్ను వ్యవస్థను సులభతరం చేయాలనే లక్ష్యంతో, 2020 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇకపై బడ్జెట్లో రానున్న కొత్త ప్రతిపాదన ప్రకారం, దంపతులను ఒకే ‘ఆర్థిక యూనిట్’గా పరిగణించే అవకాశం ఉంది.