/rtv/media/media_files/2026/05/08/tvk-vijay-2026-05-08-15-38-16.jpg)
Vijay as the Chief Minister of Tamil Nadu.
Tamil Nadu CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయాయి. నిన్నటివరకు కొనసాగిన రాజకీయ ప్రతిష్ఠంభనను బద్దలు కొడుతూ, దళిత సామాజికవర్గ బలమైన పార్టీ అయిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) చివరకు విజయ్ పార్టీ (TVK) కి మద్దతు ప్రకటించింది. తమ ఇద్దరు (2) ఎమ్మెల్యేల మద్దతు లేఖను వీసీకే అధికారికంగా టీవీకేకు అందజేసింది.
#WATCH | Chennai | TVK supports cheer after VCK extends its support to TVK to form the government in Tamil Nadu. VCK President Thol Thirumavalavan has handed over the official confirmation letter to TVK leader Aadhav Arjuna. pic.twitter.com/6tcn4z00t3
— ANI (@ANI) May 9, 2026
Also Read : సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న తమిళ రాజకీయాలు... ఇప్పటికీ తేలని పొత్తుల లెక్కలు
Vijay As The Chief Minister Of Tamil Nadu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల (మేజిక్ నంబర్) బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్(TVK Chief Vijay Meets Governor) పట్టుబట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొదట కాంగ్రెస్ (5 సీట్లు), ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు (CPI & CPI-M లు తలా 2 సీట్లు) విజయ్‌కు మద్దతు తెలపడంతో టీవీకే బలం 117కి చేరింది. అయితే మెజారిటీకి సరిగ్గా ఒక్క సీటు కొరత పడటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు వీసీకే చీఫ్ తిరుమావళవన్ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖను టీవీకేకు అందించడంతో విజయ్ బలం 118 మార్కును దాటి సురక్షితంగా 119 స్థానాలకు చేరింది.
వాస్తవానికి డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే, లెఫ్ట్ పార్టీలతో కలిసి నడవాలని భావించింది. లెఫ్ట్ పార్టీలు శుక్రవారమే విజయ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ, వీసీకే అధినేత తిరుమావళవన్ మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక కేబినెట్ పోర్టుఫోలియోలు, దళిత ఉద్యోగ కోటా సంస్కరణలు వంటి పలు డిమాండ్లను టీవీకే ముందుంచారు. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే, తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన వీసీకే, చివరకు టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. దీనితో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న చివరి సాంకేతిక అడ్డంకి కూడా తొలగిపోయింది.
వీసీకే మద్దతు లేఖ కూడా అధికారికంగా చేతికందడంతో, విజయ్(TVK Chief Vijay) నాయకత్వంలోని టీవీకే కూటమికి స్పష్టమైన మెజారిటీ (119 సీట్లు) లభించినట్లయింది. దీంతో విజయ్ శనివారం సాయంత్రం గవర్నర్‌ను కలుసుకుని అవసరమైన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు పత్రాలను అందజేయనున్నారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యా బలం అధికారికంగా రుజువు కావడంతో, గవర్నర్ వెంటనే విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఐదు దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) వంటి ద్రావిడ శక్తుల మధ్యే సాగుతున్న తమిళనాడు రాజకీయ ప్రస్థానాన్ని 'దళపతి' విజయ్ తన సరికొత్త రాజకీయ ప్రవేశంతో మలుపు తిప్పారు. తొలి ప్రయత్నంలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రాంతీయ, జాతీయ శక్తులను ఏకం చేస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక పరిణామంతో తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైందని ఆయన అభిమానులు, మద్దతుదారులు పండుగ చేసుకుంటున్నారు.
Also Read : విజయ్కు దెబ్బ మీద దెబ్బ.. VCK పార్టీ సంచలన డిమాండ్ !
Follow Us