Suvendhu Adhikari: పశ్చిమ బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారినే హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది

New Update
BJP to form govt in west bengal, suvendhu adhikari to swear in as CM

suvendhu adhikari to swear in as CM

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చివరికి అందరూ ఊహించినట్లుగానే సువేందు అధికారి(Suvendhu Adhikari) నే హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. బీజేపీ శాశసనసభ పక్షంలో ఈరోజు సువేందు అధికారి పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. మాజీ సీఎం మమతా బెనర్జీని సువేందు అధికారి రెండుసార్లు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలో బలమైన నేతగా ఎదిగిన సువేందుకే సీఎం పదవి అప్పగించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనకు అభినందనలు తెలిపారు. 

Also Read :  విజయ్ ను CM చేయాలని కాంగ్రెస్ ధర్నా.. ఉరికించి కొట్టిన DMK కార్యకర్తలు!

BJP To Form Govt In West Bengal

Also Read: TCS మతమార్పిళ్ల కేసు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితురాలు

గతంలో టీఎంసీ పార్టీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి పలు పదవులు నిర్వహించారు. శారదా గ్రూప్ పొంజీ స్కామ్ లో ఈయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. 2026లో కూడా ఆమె స్థానం నుంచి పోటీ చేసి ఓడించారు. కమ్యూనిస్టులు, టీఎంసీ పాలన తర్వాత మొదటిసారిగా బెంగాల్‌లో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కమలం పార్టీ నుంచి మొదటి సీఎంగా సువేందు అధికారి శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.  

Advertisment
తాజా కథనాలు