/rtv/media/media_files/2026/05/08/nashik-tcs-case-accused-nida-khan-held-in-chhatrapati-sambhajinagar-2026-05-08-16-29-29.jpg)
Nashik TCS Case Accused Nida Khan Held in Chhatrapati Sambhajinagar
ఇటీవల మహారాష్ట్ర(maharashtra) లోని నాసిక్‌లో TCS ఆఫీసులో లైంగిక వేధింపులు(sexual-assault), బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత 25 నుంచి ఈమె పరారీలో ఉండగా.. గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీ నగర్‌లో పోలీసులకు చిక్కింది.
ఈ మతమార్పిళ్ల కేసుకు సంబంధించి పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మేనేజర్ సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీలో సీనియర్ ఉద్యోగి అయిన నిదా ఖాన్.. వాట్సాప్ గ్రూప్‌లో ఉద్యోగులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడ్డట్లు తేలింది.
Also Read: విజయ్‌కు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
Nashik TCS Case Accused Nida Khan
ఇస్లాం సిద్ధాంతాలను పాటించాలని.. ఈ మతానికి చెందిన దుస్తులు ధరించాలని ఆమె మహిళా ఉద్యోగులను బలవంతపెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం నిధా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం నాసిక్ కోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఆమె పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఈ కేసు బయటికొచ్చినప్పటి నుంచి నిదా ఖాన్ ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమె ఆచూకి కోసం సిట్ అధికారులు గాలించారు. చివరికి గురువారం రాత్రి ఛత్రపతి శంబాజీనగర్‌లో ఆమె జాడను గుర్తించిన అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Also Read : మంచే జరుగుతుంది .. విజయం నిశ్చయం : విజయ్ సంచలన ట్వీట్!
Follow Us