TVK Chief Vijay: రేపే విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం..

వామపక్షాలు, వీసీకే పార్టీలు శుక్రవారం టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ మెజార్టీ 118కి చేరింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ చీఫ్‌ విజయ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
TVK Chief Vijay to Take Oath as Tamil Nadu Chief Minister on Monday

TVK Chief Vijay to Take Oath as Tamil Nadu Chief Minister on Monday

తమిళనాడు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వామపక్షాలు, వీసీకే పార్టీలు శుక్రవారం మద్దతు ఇవ్వడంతో టీవీకే మెజార్టీ 118కి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ చీఫ్‌ విజయ్‌(TVK chief Vijay) ప్రమాణస్వీకార కార్యక్రమానికి(oath-ceremony) ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్‌తో పాటు మరికొందరు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: పశ్చిమ బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..

TVK Chief Vijay To Take Oath As Tamil Nadu CM

మొత్తం 35 మంది సభ్యులతో విజయ్ మంత్రివర్గం ఉండనున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున, సెంగోట్టయన్, నిర్మల్ కుమార్, తిరుమావళవన్‌ తదితరులతో కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read :  శారదా గ్రూప్ స్కామ్‌లో సువేందు అధికారి !.. అసలు ఈ స్కామ్ ఏంటో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు