AIADMK : అన్నాడీఎంకేలో చీలిక? విజయ్‌కు అనుకూలంగా 38 మంది ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి (ఈపీఎస్‌) నాయకత్వానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడంతో, పార్టీ చీలిక దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

New Update
FotoJet - 2026-05-11T064237.726

Palanisamy, CV Shanmugam, SP Velumani

AIADMK : తమిళనాడు రాజకీయాల్లో కీలక పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) మరోసారి తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి (ఈపీఎస్‌) నాయకత్వానికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు తిరుగుబావుటా ఎగురవేయడంతో, పార్టీ మరో చీలిక దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం ఈపీఎస్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి.విజయభాస్కర్ వంటి బలమైన నేతలు అధిష్ఠాన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు ముఖ్యమంత్రి కావడానికి మద్దతు తెలపడం, శాసనసభా కమిటీ నాయకత్వ బాధ్యతల కేటాయింపులపై ఈపీఎస్, సీవీ షణ్ముగం మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈపీఎస్ ఏకపక్ష నిర్ణయాలతో విభేదించిన షణ్ముగం, వేలుమణి ఆ సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించి బయటకు రావడం పార్టీలో ముదురుతున్న విభేదాలకు అద్దం పడుతోంది. - TVK Party About AIDMK Party

Also Read :  అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం..

Split In AIADMK

ఈ పరిణామాల అనంతరం అసమ్మతి వర్గం తమ వ్యూహాలకు పదును పెట్టింది. ఈపీఎస్ నివాసం నుంచి బయటకు వచ్చిన సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి చెన్నైలోని షణ్ముగం కార్యాలయంలో సమాంతర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో సుమారు 38 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు జిల్లా కార్యదర్శులు పాల్గొనడం గమనార్హం. శాసనసభా కమిటీ అధ్యక్షుడిగా ఎస్పీ వేలుమణిని, ఉపాధ్యక్షుడిగా సీవీ షణ్ముగాన్ని ఎన్నుకోవాలని ఈ అసమ్మతి వర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి మద్దతుగా 38 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలలో దాదాపు 60 శాతం మంది షణ్ముగం వైపే ఉన్నారని, ఈపీఎస్ స్థానంలోకి వేలుమణిని తీసుకువచ్చి పార్టీపై పట్టు సాధించేందుకు తెరవెనుక బలమైన వ్యూహాలు పన్నుతున్నారని ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఆదివారం నాడు చెన్నైలో ఇరు వర్గాలు పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈపీఎస్ జిల్లా కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించగా, విజయ్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్న సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణిలను పార్టీ నుంచి తొలగించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో షణ్ముగం ఆధ్వర్యంలో జరిగిన మరో సమాంతర సమావేశానికి విజయభాస్కర్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మే 13వ తేదీన విజయ్ తన బలాన్ని నిరూపించుకునే సమయంలో, సీవీ షణ్ముగం వర్గం విజయ్‌కు అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ఎడప్పాడి పళనిసామి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంధి కుదిర్చేందుకు సేలం ఇళంగోవన్, అగ్రి కృష్ణమూర్తి, దళవాయ్ సుందరం, ఆర్బీ ఉదయకుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాయబార బృందాన్ని సీవీ షణ్ముగం వద్దకు పంపారు. షణ్ముగం లేవనెత్తిన డిమాండ్లను వినడానికి, సర్దుబాటు చేసుకోవడానికి ఈపీఎస్ సిద్ధంగా ఉన్నారనే ప్రతిపాదనను ఈ బృందం ఆయన ముందు ఉంచింది. అయితే, ఈ రాయబారాన్ని సీవీ షణ్ముగం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో రాజీ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో, అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా రెండు వర్గాలుగా చీలిపోవడం దాదాపు ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read :  విజయ్‌ మంత్రివర్గంలో ఒకే ఒక మహిళా మంత్రి... ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాక్‌ ...

Advertisment
తాజా కథనాలు