Suvendu Adhikari: శారదా గ్రూప్ స్కామ్‌లో సువేందు అధికారి !.. అసలు ఈ స్కామ్ ఏంటో తెలుసా ?

పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నుంచి సువేందు తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే సువేందు అధికారికి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శారాదా గ్రూప్‌ పొంజీ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

New Update
Suvendu Adhikari linked to the Saradha Group scam

Suvendu Adhikari linked to the Saradha Group scam

పశ్చిమ బెంగాల్‌(west bengal) సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి(suvendu adhikari) పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం  బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత సువేందు అధికారిని బెంగాల్‌ను సీఎంగా అమిత్‌ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నుంచి సువేందు తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సువేందు అధికారికి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శారాదా గ్రూప్‌ పొంజీ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ స్కామ్‌ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

Also Read :  మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన వైరస్.. ముగ్గురు మృతి.. WHO సంచలన ప్రకటన!

శారదా గ్రూప్ స్కామ్‌ అంటే?

శారదా గ్రూప్(Saradha Group Scam) అనే వ్యాపార సామ్రాజ్యాన్ని సుదీప్తో సేన్ అనే వ్యక్తి 2000లో ప్రారంభించారు. కేవలం కొద్ది కాలంలోనే ఈ గ్రూప్ రియల్ ఎస్టేట్, మీడియా, టూరిజం, ఏవియేషన్ లాంటి వివిధ రంగాలకు విస్తరించింది. ఈ గ్రూప్ పొంజీ అనే స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా అధిక వడ్డీలు, విదేశీ ప్రయాణాలు, ఫ్రీ ప్లాట్లు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారా సామాన్య ప్రజల నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. కొత్తగా వచ్చిన కస్టమర్ల డబ్బుతో పాత కస్టమర్లకు వడ్డీలు చెల్లిస్తూ నమ్మకం కలిగించారు. క్రమంగా కొత్తగా చేరే వారి సంఖ్య తగ్గిపోవడంతో.. పాత వారికి తిరిగి డబ్బులు చెల్లించడం కంపెనీకి సాధ్యం కాలేదు. దీంతో 2013 నాటికి శారదా గ్రూప్ బోర్డు తిప్పేసింది. దాదాపు రూ. 10,000 కోట్లకు పైగా ప్రజాధనం ఆవిరైపోయినట్లు అంచనాలు వెలువడ్డాయి. 

ఈ స్కామ్ ఇంత పెద్ద ఎత్తున కొనసాగడానికి అప్పటి పశ్చి బెంగాల్ అధిరాక పార్టీ అయిన టీఎంసీలోని కొందరు కీలక నేతల సపోర్ట్ కారమణని తెలుస్తోంది. శారదా గ్రూప్ నిర్వాహకుడు సుదీప్తో సేన్ రాసిన లేఖలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయి. అప్పట్లో TMCలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి కూడా ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. సువేందు అధికారి తన రాజకీయ బలంతో శారదా గ్రూప్ స్కామ్ కార్యకలాపాలకు సహకరించారని.. దీనికి ప్రతిఫలంగా ఆయన భారీగా ఆర్థిక ప్రయోజనం పొందినట్లు విపక్ష పార్టీలు ఆరోపించాయి. వ్యవహారంపై కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీ కూడా విచారణలు చేపట్టాయి.

Also Read: TCS మతమార్పిళ్ల కేసు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితురాలు

శారదా స్కామ్ బయటికి వచ్చాక బెంగాల్ రాజకీయాలు మారిపోయాయి. సుదీప్తో సేన్‌తో పాటు కునాల్ ఘోష్ లాంటి పలువురు టీఎంసీ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత సువేందు అధికారికి టీఎంసీ పార్టీతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన బీజేపీలో చేరారు. టీఎంసీలో ఉన్నప్పడు ఆయన్ని దోషిగా చిత్రీకరించిన బీజేపీ.. తమ పార్టీలోకి చేరగానే సువేందును కేసుల నుంచి ఉపశమనం కల్పించేలా చేసిందని విపక్షాలు ఆరోపించాయి. 

శారదా గ్రూప్ పొంజీ స్కామ్‌పై సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ స్కామ్‌ వల్ల లక్షలాది పేద కుటుంబాలు తమ జీవితకాల పొదుపును కోల్పోయి రోడ్డున పడ్డట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికీ బాధితులు న్యాయ కోసం, నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు